Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమాల్లోకి వెళ్లొద్దని మా నాన్న తేల్చి చెప్పారు: సంగీత దర్శకుడు మణిశర్మ

  • నా పట్టుదల చూసి మా నాన్న ఒప్పుకున్నారు 
  • నాలోని అంకితభావమే నన్ను నిలబెట్టింది 
  • అందుకు కారణం కూడా మా నాన్నే
జోరైన .. హుషారైన పాటలకు కేరాఫ్ అడ్రెస్ గా మణిశర్మ కనిపిస్తుంటారు. సాహిత్యాన్ని ఒడిసి పట్టుకునే ఆయన సంగీతం పరుగులు తీస్తుంటుంది. అలాంటి మణిశర్మ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. "సంగీత దర్శకుడిగా నేను సినిమా రంగంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు మా నాన్న అస్సలు ఒప్పుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమౌతుందో ఎవరికీ తెలియదు .. నువ్ ఆ ఫీల్డ్ కి వెళ్లడానికి వీల్లేదు" అన్నారు. చివరికి నా పట్టుదల చూసి ఒప్పుకున్నారు.

సంగీత దర్శకుడిగా నేను ఇంత దూరం ప్రయాణం చేయడానికి కారణం, నా క్రమశిక్షణ .. అంకితభావం. అవి మా నాన్న నుంచే వచ్చాయి .. నన్ను ఈ స్థాయిలో నిలబెట్టిన ఘనత ఆయనదే. "నీ అవసరం వుందంటే నీ కాళ్లయినా పట్టుకుంటారు .. అవసరం లేకపోతే నువ్ కాళ్లు పట్టుకున్నా అవకాశం ఇవ్వరు" అనే విషయం తనకి బోధపడినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.  
manisharma

More Telugu News